ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'మోదీపై నమ్మకంతో భాజపాలో చేరుతున్నారు' - kanna

విజయవాడలోని ఓ హోటల్​లో కన్నా సమక్షంలో గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన వ్యాపారవేత్త ఖాజా అలీ భాజాపాలో చేరారు.

భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ

By

Published : Jul 22, 2019, 6:29 PM IST

భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ

నరేంద్రమోదీ నాయకత్వంపై నమ్మకంతో దేశవ్యాప్తంగా ఎంతోమంది భాజపాలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారని భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. విజయవాడలోని ఓ హోటల్​లో కన్నా సమక్షంలో గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన వ్యాపారవేత్త ఖాజా అలీ పార్టీలో చేరారు. పార్టీలతో సంబంధం లేకుండా అన్ని పార్టీల నుంచి కార్యకర్తలు, నాయకులు వస్తున్నారని... ముఖ్యంగా మైనార్టీ, వెనుకబడిన వర్గాలకు చెందిన కార్యకర్తలు పార్టీలోకి రావడం శుభపరిణామం అన్నారు. నరేంద్రమోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధిపథంలో సాగాలని కన్నా ఆకాంక్షించారు. పోలవరం ముంపు ప్రాంతాలకు చెందిన పలువురు జనసేన, వైకాపా నేతలను పార్టీ కండువా కప్పి కన్నా పార్టీలోకి ఆహ్వానించారు.

ABOUT THE AUTHOR

...view details