మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చెందిన రూ.6 లక్షలు దొంగతనానికి గురై చివరికి దొరికాయి. ఆయన కారు డ్రైవర్ ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. దివాకర్ రెడ్డి ఈనెల 11న మధ్యాహ్నం 12 గంటలకు విజయవాడకు విమానంలో వచ్చారు. విమానాశ్రయం నుంచి కారులో నేరుగా గాంధీనగర్‌లోని ఓ హోటల్‌కి వెళ్లారు. తర్వాత సచివాలయానికి వెళ్లి 2.30కి తిరిగివచ్చారు. దివాకర్ రెడ్డి సూట్‌కేసును కారు డ్రైవర్ గౌతమ్ తీసుకొచ్చి హోటల్ గదిలో పెట్టి వెళ్లిపోయాడు. సాయంత్రం 6 గంటల సమయంలో జేసీ దాన్ని తెరవగా రూ. 6 లక్షలు కనిపించలేదు. వెంటనే ఆయన క్రైం డీసీపీ కోటేశ్వరరావుకు సమాచారమిచ్చారు. కారులో నుంచి ఆయన సూట్‌కేసు తెచ్చిన పోరంకి వాసి, డ్రైవర్ గౌతమ్‌ను పోలీసులు విచారించారు. పొంతన లేని సమాధానాలు చెప్పటంతో అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. కారులో డ్రైవర్ సీటు కింద నగదు పెట్టినట్లు గౌతమ్ వెల్లడించాడు. సీపీఎస్ పోలీసులు కారును తనిఖీ చేయగా మొత్తం నగదు లభించింది. నగదును స్వాధీనం చేసుకుని డ్రైవర్ గౌతమ్‌ను ఆదివారం అరెస్టు చేశారు.
దొంగతనానికి గురైన జేసీ దివాకర్ రెడ్డి నగదు దొరికాయి
మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి చెందిన రూ.6 లక్షలు చోరీకి గురయ్యాయి. పోలీసులు విచారణ చేపట్టగా ఆయన కారు డ్రైవరే ఈ నిర్వాకానికి పాల్పడినట్లు తెలిసింది.
జేసీ దివాకర్ రెడ్డి
Last Updated : Oct 14, 2019, 5:04 AM IST