జయరామ్ హత్య కేసులో నిందితుడు దొరికాడు...! - ఎక్స్‌ప్రెస్ టీవీ ఎండి
చిగురుపాటి జయరాం హత్య కేసులో పోలీసుల పురోగతి. రాకేశ్ రెడ్డి అనే వ్యక్తి హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధరణ.
చిగురుపాటి జయరాం హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. కుక్కలను చంపటానికి వాడే ఇంజెక్షన్ చేసి జయరామ్‌ను హత్య చేసినట్టు పోలీసులు విచారణలో తేల్చారు. ఆర్థిక లావాదేవీల్లో విభేదాలే జయరాం హత్యకు కారణమని ప్రాథమికంగా నిర్ధరించారు. హైదరాబాద్‌లోనే హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.
ఇంజెక్షన్ ప్రభావంతో 10 నిమిషాల్లోనే జయరాం శరీరం విషపూరితమైందని... శరీరం రంగు మారడానికి విషమే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహం గుర్తించడానికి 24 గంటల ముందే హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు. హత్య కేసులో మేనకోడలు శిఖా, ఆమె మిత్రుడు రాకేష్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. హత్య, ఆర్థిక వివాదాలు, నగదు బదిలీ హైదరాబాద్‌లోనే జరిగినట్లు అనుమానం నేపథ్యంలో... కేసు కృష్ణా జిల్లా నుంచి హైదరాబాద్ బదిలీ అయ్యే అవకాశంపైనా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.