25 ఏళ్లుగా తెదేపా కాపాడుతున్న బీసీ రిజర్వేషన్లను జగన్ విధ్వంసం చేశారని మాజీ మంత్రి జవహర్ ఆరోపించారు. రిజర్వేషన్లపై హైకోర్టులో కేసు వేసిన ప్రతాప్ రెడ్డి, ఆంజనేయులు జగన్ అనుచరులేనని స్పష్టం చేశారు. బీసీలకు జరుగుతోన్న అన్యాయంపై మంత్రులెవరూ ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. బీసీలకు రిజర్వేషన్లపై వైకాపా ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే తాము సహకరిస్తామన్నారు. బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు జగన్ సుముఖంగా లేరన్న జవహర్... భవిష్యత్లో తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు.
రిజర్వేషన్లపై కేసు వేసింది జగన్ అనుచరులే: జవహర్ - బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు న్యూస్
బీసీలను అణగదొక్కే చరిత్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదని మాజీ మంత్రి జవహర్ ఆరోపించారు. బీసీల ఆస్తులు విధ్వంసం చేసి గనులు, భూములు లాక్కున్నారని మండిపడ్డారు.
రిజర్వేషన్లపై కేసు వేసింది జగన్ అనుచరులే: జవహర్