పోలవరం ప్రాజెక్టులో ఏం అవినీతి జరిగిందో కేంద్ర జలశక్తి మంత్రికి ఫోన్ చేసి భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు తెలుసుకొని మాట్లాడాలని మాజీ మంత్రి జవహర్ అన్నారు. వైకాపా నేతలు రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం మాని వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు. పోలవరంలో ఎలాంటి అవినీతి జరగలేదని కేంద్ర జలశక్తి మంత్రి పార్లమెంటు వేదికగా చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
అయినా.. ఇలా దుష్ప్రచారం చేయటం సరికాదన్నారు. నీతి అయోగ్ సిఫార్సు మేరకు నిర్మాణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అప్పగించిన విషయం తెలియదా? అని ప్రశ్నించారు. ఒక యజ్ఞంలా పోలవరాన్ని పూర్తి చేసేందుకు చంద్రబాబు పనిచేశారంటూ భాజపా నేతలే ప్రశంసించిన విషయం మర్చిపోయారా? అని నిలదీశారు. అవినీతి జరిగిందని దుష్ప్రచారం చేయటం వైకాపా కోసమేనన్నారు.