జగన్ ప్రభుత్వం నవ్యాంధ్రను మత్తాంధ్రగా మార్చిందని మాజీ మంత్రి జవహర్ ధ్వజమెత్తారు. "మద్యం ధరలను 90శాతం పెంచిన జగన్ పేదల రక్తం తాగుతున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాల అద్దెలో రూ.108కోట్లు ఆదా చేశామని ఎక్సైజ్ మంత్రి గర్వంగా చెప్తున్నారు. మద్యం దుకాణాలను ప్రైవేటుకు ఇచ్చి ఉంటే రూ.562 కోట్లు ఆదా అయ్యేది. ఒక్కో మద్యం దుకాణం నుంచి అద్దె రూపేణా నెలకు రూ.1.56లక్షల ప్రజాధనం దోచుకుంటున్నారు. ఇందులో మద్య నియంత్రణ ఎక్కడ ఉందో ఎవ్వరికీ అర్థంకావట్లేదు. ఊరు పేరు లేని నాశిరకం మద్యాన్ని అందుబాటులో ఉంచి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అధిక ధరకు మద్యం కొనలేక శానిటైజర్ తాగి చనిపోయిన 50మంది కుటుంబాలకు దిక్కెవరు." అని ఓ ప్రకటనలో నిలదీశారు.
నవ్యాంధ్రను మత్తాంధ్ర ప్రదేశ్‌గా మార్చేశారు: జవహర్ - లిక్కర్ పై మంత్రి జవహర్ కామెంట్స్
మద్యం ధరలను 90 శాతం పెంచిన సీఎం జగన్...పేదల రక్తం తాగుతున్నారని మాజీ మంత్రి జవహర్ మండిపడ్డారు. ఊరు పేరు లేని నాసిరకం మద్యాన్ని అందుబాటులో ఉంచి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ధ్వజమెత్తారు. నవ్యాంధ్రను మత్తాంధ్రగా మార్చారని ఆరోపించారు.
జగన్ ప్రభుత్వం నవ్యాంధ్రను మత్తాంధ్రగా మార్చింది: జవహర్