ముఖ్యమంత్రి జగన్ కారు షెడ్డంత కూడా ఉండని జాగా ఇచ్చి.. ఏదో గొప్పగా చేసినట్లు ఇళ్లపట్టాల పంపిణీపై అధికార పార్టీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారని మాజీ మంత్రి జవహర్ ఆరోపించారు. ఉప్పు భూముల్లో ఇళ్లు ఏ విధంగా నిలబడతాయో ఒకసారి ఆలోచించాలని హితవు పలికారు. ఏటవాలు, ముంపు, రోడ్డు మార్జిన్ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలిచ్చారని ఆయన ఆరోపించారు. పట్టాల పంపిణీలో జగన్ ప్రజల్ని మాయచేసి మభ్య పెట్టారే తప్ప.. చేసిందేమీ లేదని విమర్శించారు.
ఇంటి స్థలం జగన్ కారు షెడ్డంతా లేదు: మాజీ మంత్రి జవహర్ - ఇళ్ల పట్టాల పంపిణీపై జవహర్
ఇళ్ల పట్టాల పంపిణీలో జగన్ ప్రజల్ని మాయచేసి మభ్య పెట్టారే తప్ప చేసిందేమీ లేదని మాజీ మంత్రి జవహర్ విమర్శించారు. సీఎం జగన్ కారు షెడ్డంత కూడా ఉండని జాగా ఇచ్చి.. ఏదో గొప్పగా చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారని ఆక్షేపించారు.
ఇళ్ల స్థలాలు జగన్ కారు షెడ్డంత కూడా ఉండవు