ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాజధానిలో ఆ భూములు వైకాపా నేతలవి కాదా?: జనసేన - జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేశ్ వార్తలు

రాజధాని ప్రాంతంలో వైకాపా నేతలకు భారీగా భూములున్నాయని జనసేన అధికార ప్రతినిధి మహేశ్ ఆరోపించారు. ముఖ్యమంత్రి నివాసానికి ముందు 7 ఎకరాలు ఉన్న సునీల్ రెడ్డి ఎవరి బినామీ అని ప్రశ్నించారు.

jansena spokes person mahesh fires on ycp government
జనసేన అధికార ప్రతినిధి మహేశ్

By

Published : Jan 3, 2020, 9:24 PM IST

మీడియా సమావేశంలో జనసేన అధికార ప్రతినిధి మహేశ్

రాజధాని అమరావతిలో వైకాపా నేతలకు భూములున్నది నిజం కాదా అని జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేష్ ప్రశ్నించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన... వైకాపా ప్రభుత్వంపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి నివాసానికి ముందు 7 ఎకరాలు ఉన్న సునీల్ రెడ్డి ఎవరి బినామీ అని ప్రశ్నించారు. మంగళగిరి హైవే పక్కన 35 ఎకరాలున్న సునీల్ రెడ్డి ఎవరని నిలదీశారు. శిల్పామోహన్‌రెడ్డికి 28 ఎకరాల భూమి ఉన్నమాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. అలాగే మూడు పంటలు పండే భూములను రాజధాని ప్రాంతానికి ఇచ్చిన రైతుల మనోభావాల్ని దెబ్బతీసేలా మంత్రులు మాట్లాడటం దారుణమని మహేష్ అన్నారు. రాజధానిపై సర్కార్ స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అభివృద్ధిని వికేంద్రీకరించాలే తప్ప పాలన అంతా ఒక్కచోటే ఉండాలన్నారు. ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టేందుకే మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చారని ఆరోపించారు. పవన్ కల్యాణ్​పై వైకాపా నేతల విమర్శలను తప్పుబట్టిన పోతిన మహేష్.... మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణ అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారి అంటూ దుయ్యబట్టారు.

ABOUT THE AUTHOR

...view details