స్వరూపానంద స్వామి, సజ్జల రామకృష్ణా రెడ్డితో బేరం కుదరబట్టే దుర్గగుడి ఈఓ సురేష్ బాబు సస్పెన్షన్ వేటు ఆగిపోయిందని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ ఆరోపించారు. అక్రమ కాంట్రాక్టులు ఇచ్చి.. అమ్మ సొమ్మును దోచుకున్న సురేష్ బాబుని వదిలేసి.. ఉద్యోగులను సస్పెండ్ చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. తాడేపల్లి ప్యాలెస్లో బేరం కుదిరితే సస్పెన్షన్ ఆగిపోతుందని తాను ముందుగానే చెప్పానని గుర్తు చేశారు.
తాడేపల్లి ప్యాలెస్లో బేరం కుదరబట్టే.. ఈఓ సస్పెన్షన్ ఆగింది - దుర్గగుడి ఈవో సస్పెన్షన్ పై జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ తాజా వ్యాఖ్యలు
తాడేపల్లి ప్యాలెస్లో బేరం కుదరబట్టే.. దుర్గగుడి ఈఓ సురేష్ బాబు సస్పెన్షన్ వేటు ఆగిపోయిందని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సితార సెంటర్ వద్ద ఆ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి బొమ్మ గోవిందు లక్ష్మీ తరుపున ప్రచారంలో పాల్గొన్న ఆయన.. దుర్గ గుడిలో ఉద్యోగులను సస్పెండ్ చేయటంపై మండిపడ్డారు.

జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్
జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్
గుడివాడలో కొడాలి నాని పేకాట స్థావరాలపై ఇలాగే దాడులు చేసి.. అనంతరం బేరం కుదుర్చుకొని మాఫీ చేశారని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 45వ డివిజన్ సితార సెంటర్ వద్ద జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి బొమ్మ గోవిందు లక్ష్మీతో ప్రచారంలో ఆయన పాల్గొన్న ఆయన దుర్గగుడి ఈఓ సురేష్ బాబు సస్పెన్షన్పై పలు విమర్శలు చేశారు.
ఇవీ చూడండి...:దుర్గగుడి అక్రమాల వ్యవహారంలో చర్యలు..