Pothina Mahesh: వైకాపా ప్రభుత్వంపై జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పవన్ కల్యాణ్ కౌలు రైతుల భరోసా యాత్రతో వైకాపా నేతలకు భయం పట్టుకుందన్నారు. మూడేళ్లల్లో కౌలు రైతుల సమస్యలు పట్టించుకోని వైకాపా... ఇప్పుడు హడావుడి చేస్తూ డబ్బులు ఇస్తున్నారని విమర్శించారు. ఈ మూడేళ్లల్లో కౌలు రైతుల ఆత్మహత్యలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చేతిదాకా వచ్చిన పంట నోటికి అందకుండా పోతుందంటే.. జగన్ ఐరన్ లెగ్ ప్రభావమేనన్నారు. రైతు మిత్రడు పవన్ కల్యాణ్ అయితే... రైతువంచకుడు జగన్మోహన్ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Mahesh: "పవన్ కౌలు రైతుల భరోసా యాత్రతో... వైకాపాకు భయం పట్టుకుంది" - ఏపీ లేటెస్ట్ అప్డేట్స్
Pothina Mahesh: పవన్ కల్యాణ్ 'కౌలు రైతుల భరోసా యాత్ర'తో వైకాపా నేతలకు భయం పట్టుకుందని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ అన్నారు. ఈ మూడేళ్లల్లో కౌలు రైతుల ఆత్మహత్యలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చేతిదాకా వచ్చిన పంట నోటికి అందకుండా పోతుందంటే.. జగన్ ఐరన్ లెగ్ ప్రభావమేనన్నారు. రాష్ట్రంలోని నదుల పేర్లను... ఆడవారి పేర్లు అనుకుని మంత్రి అంబటి రాంబాబు పొరపాటు పడుతున్నారని ఎద్దేవా చేశారు.

Pothina Mahesh: జలవనరుల శాఖను మంత్రి అంబటి రాంబాబు.. స్విమ్మింగ్‌పూల్ శాఖ అనుకుంటున్నారని పోతిన మహేష్ ఎద్దేవా చేశారు. అసలు పోలవరం, పులిచింతల ఎక్కడ ఉన్నాయో అంబటికి తెలుసా అని నిలదీశారు. రాష్ట్రంలోని నదుల పేర్లను... ఆడ వారి పేర్లు అనుకుని మంత్రి పొరపాటు పడుతున్నారని ఎద్దేవాచేశారు. గోదావరి, కృష్ణా అంటే నదులు... సన్యన, సుకన్య అని పొరబడుతున్నారని పోతిన మహేష్ అన్నారు.
పవన్‌ను తిట్టడానికే మంత్రి పదవులిచ్చారా..?జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను తిట్టడం కోసమేనా కొత్తగా మంత్రి పదవులు ఇచ్చింది... అని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. గతంలో ఇదే మాదిరి మాట్లాడిన మంత్రులు అంతా గొడ్ల సావీడికి పరిమితమయ్యారన్నారు. పవన్ జీవితం అంతా ప్రపంచానికి తెలిసిందేనన్నారు. వైకాపా నేతల్లాగా చీకటి బ్రతుకు తమకు లేదని విమర్శించారు. వ్యభిచార గృహాలు నడిపే వైకాపా నేతలా..? మమ్మల్ని విమర్శలు చేసేదని దుయ్యబట్టారు. విశాఖలో మంత్రి అమరనాథ్ భూకబ్జాలపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రైతు సమస్యలపై మాట్లాడితే మహిళలను కించ పరుస్తారా అని ప్రశ్నించారు. వైకాపా మాదిరిగా ఓ కులానికి జనసేన కొమ్ముకాయదని ధ్వజమెత్తారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే మంత్రుల ఇళ్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. ప్రజలతో తన్నులు తినే పనులు చేయొద్దని శ్రీనివాస్ హితవుపలికారు.
ఇదీ చదవండి: Family suicide attempt: విజయవాడలో కుటుంబం ఆత్మహత్యాయత్నం.. అప్పులే కారణమా..!