ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'మట్టి పనులకు 16 నెలలు తీసుకున్నారు' - జనసేన మహేశ్ తాజా వార్తలు

కనకదుర్గ ఫ్లైఓవర్​కు ఇరువైపులా మట్టిపనులు చేసేందుకు 16 నెలల సమయం తీసుకున్న వైకాపా నేతలు.. పైవంతెన పూర్తి చేశామని చెప్పుకోవడం హాస్యాస్పదమని.. జనసేన అధికార ప్రతినిథి పోతిన మహేశ్ ఎద్దేవా చేశారు. ఒకప్పుడు ఫ్లైఓవర్ వద్దంటూ ఉద్యమించిన వైకాపా నాయకులు ఇప్పుడు ప్రారంభోత్సవానికి ఎలా వస్తారంటూ నిలదీశారు.

pothina mahesh
పోతిన మహేశ్, జనసేన అధికార ప్రతినిథి

By

Published : Oct 16, 2020, 4:04 PM IST

విజయవాడ ప్రాంతంలో రాజధాని వద్దంటున్న వైకాపా ప్రజాప్రతినిధులు ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి రావడానికి అనర్హులని జనసేన అధికార ప్రతినిథి పోతిన మహేశ్ అన్నారు. వైకాపా నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. ఒకప్పుడు 'కనకదుర్గ ఫ్లైఓవర్ వద్దు-రోడ్డు వైడనింగ్ ముద్దు' అంటూ ఉద్యమించిన వారు.. నేడు ప్రారంభోత్సవానికి ఎలా వచ్చారని నిలదీశారు.

పైవంతెనకు ఇరువైపులా మట్టి పనులు చేయడానికి 16 నెలల సమయం తీసుకున్న ప్రభుత్వ నేతలు.. ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేశామని చెప్పుకోవడం విడ్డూరమన్నారు. వారి తీరు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కనకదుర్గ పైవంతెన పూర్తిచేసిన ఘనత భాజపాకు, కేంద్ర ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. విజయవాడ రాజధాని ప్రాంతం అయినందునే ఫ్లైఓవర్ కల సాకారమైందని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details