విజయవాడ దుర్గగుడి అవినీతికి కేరాఫ్‌గా మారిపోయిందని.. జనసేన అధికార ప్రతినిధి మహేశ్ ఆరోపించారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి కనుసైగల్లో భారీ అవినీతికి తెరలేపారని వ్యాఖ్యానించారు. అమ్మవారి ఆదాయానికి ఇష్టానుసారం గండి కొడుతున్నారన్నారు. అభివృద్ధి కార్యక్రమాలపై ఆడిట్ జరగటం లేదని తెలిపారు. దేవస్థానం నిధులను ఇష్టానుసారం విడుదల చేస్తున్నారని మహేశ్ పేర్కొన్నారు. సీ వేజ్ ప్లాంటు పేరుతో మూడు కొట్లు అవినీతి జరిగినట్లు అనుమానాలు ఉన్నాయన్న మహేశ్... ఈఓ సూరేష్ బాబు, మంత్రి వెల్లపల్లి బినామిగా కొనసాగుతున్నారనే విమర్శలు వస్తున్నాయని వెల్లడించారు.
'విజయవాడ దుర్గగుడి అవినీతికి కేరాఫ్‌గా మారిపోయింది' - దుర్గ గుడిపై జనసేన కామెంట్స్
మంత్రి వెల్లంపల్లి కనుసన్నల్లోనే విజయవాడ దుర్గమ్మ ఆలయంలో భారీ అవినీతికి తెరలేపారని జనసేన పార్టి అధికార ప్రతినిధి పోతీన మహేశ్ బాబు ఆరోపించారు. ఆలయంలో అభివృద్ధి కార్యక్రమాలపై ఆడిట్ జరగడం లేదని.. ఇష్టానుసారంగా నిధులు విడుదల చేస్తున్నారని మండిపడ్డారు.
janasena spokes person mahesh comments on minister vellampalli