ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'మంత్రి గారూ.. విరాళాల లెక్కలు చెప్పండి' - ఏపీలో కరోనా వైరస్ వార్తలు

విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన ఓ వార్డు వాలంటీర్​​కు కరోనా పాజిటివ్ రావటంపై జనసేన అధికారి ప్రతినిధి పోతిన మహేష్ ఆందోళన వ్యక్తంచేశారు. కరోనా వచ్చిన వాలంటీర్​ను పీపీఈ దుస్తులు వేయకుండా సాధారణంగా తీసుకెళ్లడాన్ని ఆయన తప్పుబట్టారు. వాలంటీర్​తో కలిసి విధులు నిర్వహించిన ఇతర వాలంటీర్లు, స్థానిక వైకాపా నేతలకూ కరోనా పరీక్షలు చేయాలని మహేష్ కోరారు.

janasena spokes person mahesh
జనసేన అధికారి ప్రతినిధి పోతిన మహేష్

By

Published : Apr 18, 2020, 8:55 PM IST

మీడియాతో జనసేన అధికారి ప్రతినిధి పోతిన మహేష్

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వార్డు వాలంటీర్​కు కరోనా పాజిటివ్ వచ్చినందున... స్థానిక వైకాపా నాయకులకు కూడా టెస్టులు చేయాలని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ అన్నారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సేకరించిన విరాళాల లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రికి ప్రచారంపై ఉన్న ఆసక్తి కరోనా నియంత్రణపై లేదని ఆరోపించారు. ఇప్పటికే పశ్చిమ నియోజకవర్గంలో అనేక వార్డులు రెడ్ జోన్లుగా ప్రకటించినప్పటికీ మంత్రి సహా వైకాపా అభ్యర్థులు గుంపులుగా తిరుగుతూ ప్రజలలో భయాందోళనలు సృష్టిస్తున్నారన్నారు.

కరోనా పాజిటివ్ వచ్చిన వార్డు వాలంటీర్​కు పీపీఈ దుస్తులు వేయకుండానే తరలించడం ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేసిందన్నారు. ఇంతవరకు వారి కుటుంబ సభ్యులను క్వారంటైన్​కు తరలించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. వాలంటీర్ శుక్రవారం సాయంత్రం వరకు విధుల్లోనే ఉన్నారని, ఏ వాలంటీర్లతో విధులు నిర్వహించారో, ఎక్కడెక్కడ రేషన్ అందజేశారో, స్థానిక వైకాపా నాయకత్వంతో ఎక్కడ కలిసి పనిచేశారో వారందరికీ తప్పనిసరిగా కరోనా టెస్టులు చేయాలని మహేష్ కోరారు.

ABOUT THE AUTHOR

...view details