ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఆదాయంపై ఉన్న దృష్టి... ఆచారాలపై ఉండదు' - దుర్గగుడి ఆలయ ఈవో సురేశ్ బాబు వార్తలు

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ ఈవో సురేశ్ బాబుపై జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేశ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సంచి మీద ఉన్న దృష్టి.. సంప్రదాయాల మీద ఉండదని విమర్శిస్తూ ఓ ఫొటోను ట్వీట్ చేశారు.

janasena spokes person criticising durga temple eo
janasena spokes person criticising durga temple eo

By

Published : May 4, 2020, 9:04 PM IST

పోతిన మహేశ్ ట్వీట్

మంత్రి అండతో వచ్చిన విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ కార్యనిర్వాహక అధికారికి ఆదాయం పైన దృష్టి ఉంటుంది కానీ... ఆచారాల మీద ఉంటుందా అని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేశ్ ట్వీట్ చేశారు. ఈవో సురేశ్ బాబు ఆలయ పరిసరాల్లో బూట్లు వేసుకుని సిబ్బందికి నిత్యావసరాలు పంపిణీ చేస్తున్న ఫొటోను ట్విటర్​లో ఉంచారు. సంచి మీద ఉన్న దృష్టి.. సంప్రదాయాల మీద ఉండదని విమర్శించారు. హైకోర్టు.. ఈవో అనర్హుడని ప్రకటించినా... ప్రభుత్వం ఆయనకు అండగా నిలిచిందంటే అవినీతిలో మంత్రితో పాటు ముఖ్యమంత్రికి కూడా భాగస్వామ్యం ఉందా అనే అనుమానం కలుగుతోంది మహేశ్ ట్విటర్​లో విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details