ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Pawan Kalyan: నేతాజీని గౌరవించుకోకపోతే.. మనం భారతీయులమే కాదు: పవన్‌ - BringbackNetajiAshes

Pawan Kalyan: నేతాజీ అస్తికలు దేశానికి తీసుకురావాలని ప్రజలు బలంగా కోరుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఆయన అస్తికలు రెంకోజీ ఆలయంలో దిక్కులేకుండా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పవన్‌కల్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యుమన్ ఎక్స్‌లెన్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ శిల్పకళా వేదికలో నిర్వహించిన నేతాజీ గ్రంథ సమీక్షలో ఆయన పాల్గొన్నారు.

Netaji book review at hyderabad
జనసేన అధినేత పవన్ కల్యాణ్

By

Published : Mar 24, 2022, 10:51 PM IST

నేతాజీని గౌరవించుకోకపోతే.. మనం భారతీయులమే కాదు: పవన్‌

Pawan Kalyan: సినిమా ఉచితంగా చేస్తానేమో కానీ పుస్తకాలను మాత్రం ఇవ్వనని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. త్రివిక్రమ్ వస్తున్నాడంటే పుస్తకాలను దాచేస్తానని చమత్కరించారు. నేను సినిమా నటుడు అవ్వాలని అనుకోలేదని.. అలాగే ప్రజా సేవలోకి రావాలని కూడా ఊహించలేదన్నారు. పవన్‌కల్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యుమన్ ఎక్స్‌లెన్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ శిల్పకళావేదికలో నిర్వహించిన నేతాజీ గ్రంథ సమీక్షలో ఆయన పాల్గొన్నారు. నేతాజీ గ్రంథ సమీక్షకు డా.పద్మజారెడ్డి హాజరయ్యారు.

వంద రూపాయల నోటుపై నేతాజీ బొమ్మ వేయాలి:నేతాజీ అస్తికలు మన దేశానికి తీసుకురావాలని ప్రజలు కోరుకోవాలని పవన్‌ కల్యాణ్‌ సూచించారు. నేతాజీ అస్తికలు రెంకోజి ఆలయంలో దిక్కు లేకుండా పడి ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ అస్తికలు నేతాజీవి అవునా కాదా అని పరీక్షలు చేయలేరా అని పవన్‌కల్యాణ్‌ ప్రశ్నించారు. ఇప్పటికి మూడుసార్లు ప్రయత్నించినా కుదరలేదన్నారు. నేతాజీని గౌరవించుకోకపోతే మనం భారతీయులమే కాదని పవన్‌ కల్యాణ్ పేర్కొన్నారు. వంద రూపాయల నోటుపై నేతాజీ బొమ్మ వేయాలని సూచించారు. జైహింద్ అనే నినాదాన్ని ఇచ్చిన వ్యక్తి సుభాష్ చంద్రబోస్ అని పవన్ కొనియాడారు.

ఎంవీఆర్ శాస్త్రిని ఇప్పటివరకు మూడుసార్లు కలిశా:నేతాజీ గ్రంథ సమీక్ష పుస్తకాన్ని రచించిన ఎంవీఆర్ శాస్త్రిని ఇప్పటివరకు మూడుసార్లు కలిశానని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. కామన్‌మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ సమయంలో శాస్త్రితో పరిచయం ఏర్పడిందన్నారు. మన నుడి-మన నది కార్యక్రమంలో మరోసారి కలిసినట్లు వెల్లడించారు. ఇప్పుడు ఈ పుస్తక సమీక్షలో మళ్లీ కలిశానని తెలిపారు. నాకు మేధావులంటే భయమని.. నేను సగటు మనిషిని పేర్కొన్నారు. ఎంవీఆర్ శాస్త్రి దాదాపు 20 పుస్తకాలు రచించారని పవన్‌కల్యాణ్‌ ప్రశంసించారు. అనంతపద్మనాభ స్వామి నేలమాలిగల్లో ఉన్న సంపద కంటే గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలకే ఎక్కువ విలువైనవని తెలిపారు. దేశం కోసం త్యాగం చేసిన వ్యక్తుల జీవితాలను చదవడం వల్లే నాకు జీవితం అంటే ఏందో అర్థమైందన్నారు.

#RenkojitoRedfort పేరుతో హ్యాష్ ట్యాగ్ విడుదల:నేతాజీ లాంటి మహాత్మున్ని గౌరవించుకోకపోతే మనం భారతీయులమే కాదని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. #BringbackNetajiAshes బ్రింగ్ బ్యాక్‌ నేతాజీ యాసెస్ హ్యాష్‌ ట్యాగ్‌ను ఆయన పంచుకున్నారు. ప్రస్తుతం ఈ దేశం నాదనుకునే ఒక్క నాయకుడు లేడన్నారు. నేతాజీ కోసం కొత్త తరం కదలి రావాలని పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు.

ఇదీ చూడండి:రాజీనామా చేసి 3 రాజధానులపై ప్రజల తీర్పును కోరండి: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details