ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ప్రాణనష్టం జరిగితే కానీ ముఖ్యమంత్రి స్పందించరా' - దుర్గ గుడి ప్రమాదం విషయంలో జగన్​పై జనసేన విమర్శలు

దుర్గగుడి కొండచరియలు విరిగిపడిన ఘటనపై సీఎం జగన్ ఇంతవరకూ స్పందించలేదని.. ప్రాణనష్టం జరిగితేనే స్పందిస్తారా అని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేశ్ ప్రశ్నించారు. ఆలయ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఘటన జరిగిందని ఆరోపించారు.

pothina mahesh
పోతిన మహేశ్, జనసేన అధికార ప్రతినిథి

By

Published : Oct 22, 2020, 3:08 PM IST

విజయవాడ దుర్గ గుడి కొండచరియలు విరిగిపడిన ఘటన అధికారుల నిర్లక్ష్యం, ముందుచూపు లేకపోవడం వల్లే జరిగిందని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేశ్ ఆరోపించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై సీఎం జగన్ చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ప్రాణనష్టం జరిగితే కానీ స్పందించరా అని నిలదీశారు. దసరాను రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించని ముఖ్యమంత్రి.. దుర్గ గుడి అభివృద్ధికి రూ. 70 కోట్లు ఇస్తానని ప్రకటన చేయడం నమ్మశక్యంగా లేదన్నారు.

ABOUT THE AUTHOR

...view details