హిందూ ఆచారాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి అవగాహన లేదని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేశ్ విమర్శించారు. అమావాస్య ముందు ఆలయాల పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేయటం పట్ల ఆయన మండిపడ్డారు. రామతీర్థం నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే శంకుస్థాపన చేశారన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దాడి కేసుల్లో దోషులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ పోలీసు వ్యవస్థ మీద నమ్మకం లేదని..,దేవాలయాల ఘటనకు సంబంధించిన అన్ని కేసులను తెలంగాణ పోలీసులకు అప్పగించాలన్నారు.
రామతీర్థం నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే సీఎం జగన్ ఆలయాలకు శంకుస్థాపన - జగన్పై పోతిన మహేశ్ కామెంట్స్
రామతీర్థం నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే సీఎం జగన్ ఇవాళ దేవాలయాలకు శంకుస్థాపన చేశారని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేశ్ విమర్శించారు. హిందూ ఆచారాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి అవగాహన లేదని మండిపడ్డారు.
రామతీర్థం నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే సీఎం జగన్ ఆలయాలకు శంకుస్థాపన