అమరావతిని రాజధానిగా కొనసాగించాలని 300 రోజులుగా రైతులు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా జనసేన విజయవాడ విభాగం నిరసన కార్యక్రమం తలపెట్టింది. రేపు... విజయవాడ ధర్నా చౌక్ వద్ద సామూహిక నిరసన దీక్ష చేస్తున్నట్లు ఆ పార్టీ ప్రతినిధి పోతిన మహేష్ వెల్లడించారు.
పార్టీ శ్రేణులు నిరసనలో పాల్గొనాలని కోరారు. వైకాపా ప్రభుత్వం అక్రమంగా రాజధాని వికేంద్రీకరణ చేపట్టిందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం 33 వేల ఎకరాల త్యాగం చేసిన రైతులను కష్టపెట్టడం సమంజసంకాదని స్పష్టం చేశారు.