ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్(మైనారిటీ)లను ఓటు బ్యాంకుగా చూస్తూ... సంక్షేమ పథకాల ముసుగులో వైకాపా ప్రభుత్వం వారి అభివృద్ధిని పక్కదోవ పట్టిస్తోందని జనసేన పార్టీ అధికార ప్రతినిథి పోతిన మహేశ్ విమర్శించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్కు బహిరంగ లేఖ రాశారు.
అణగారిన వర్గాలను వైకాపా జెండా మోసే కూలీలుగా చూస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ ఆయా వర్గాల మీద చూపుతున్నది కపట ప్రేమ కాదా అని ప్రశ్నించారు. ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ సోదరులు త్వరలోనే సీఎం అసలు రంగును గుర్తిస్తారన్నారు. ఏడాదిలోనే 90 శాతం హామీలు నెరవేర్చామని అసత్య ప్రచారాలు చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. నామినేటెడ్ పదవుల కేటాయింపు వ్యవహారంలోనూ, ఉన్నత సలహాదారుల హోదాలో చేసిన పదవుల పందేరంలోనూ, తాజాగా రాజ్యసభ సీట్ల కేటాయింపు అంశంలోనూ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు అన్యాయం చేసిన మాట వాస్తవం కాదా అని నిలదీశారు.