ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దుర్గమ్మ ఆలయమా.... వైకాపా కార్యాలయమా?: పోతిన మహేష్ - durga temple newsvijayawada news

వైకాపా ప్రభుత్వంపై జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేష్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బెజవాడ దుర్గమ్మ దేవాలయం ప్రాంగణంలో మంత్రి క్యాంపు కార్యాలయం పెట్టడాన్ని తప్పుపట్టారు. అక్కడ రాజకీయ సమావేశాలు పెట్టడమేంటని నిలదీశారు. ఇది దుర్గమ్మ ఆలయమా.... వైకాపా కార్యాలయమా అంటూ ప్రశ్నించారు.

janasena-party-spokesperson-pothina-mahesh-criticized-the-ycp-government
జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేష్

By

Published : Nov 6, 2020, 1:09 PM IST

అమ్మవారి ఆలయమా.... వైకాపా కార్యాలయమా అని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్‌ నిలదీశారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న మంత్రి క్యాంపు కార్యాలయంలో రాజకీయ సమావేశాలా అంటూ మండిపడ్డారు. దుర్గగుడి ఈవో సురేష్ బాబు రాజీనామా చేసి వైకాపా సభ్యత్వం తీసుకోవాలని హితవు పలికారు. కరోనా లాక్డౌన్ నాటి నుంచి నిన్నటి సమావేశం వరకూ అమ్మవారి ప్రసాదాలను కుంభాల కుంభాలు వైకాపా నాయకులకి, కార్పొరేటర్ అభ్యర్థులకు దోచి పెడుతున్నారని మహేష్ ఆరోపించారు.

ఆలయంలో జరుగుతున్న వరుస సంఘటనలు భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయన్నారు. ఛైర్మన్ పదవి సోమి నాయుడుకు ఆలయ ప్రతిష్టను పెంచడానికా లేక దిగజార్చడానికా అని ప్రశ్నించారు. అవినీతి మీద ఎలాగో స్పందించరు... ఆలయ సాంప్రదాయాలను వైకాపా మంటగలుపుతున్నా సీఎం స్పందించరా అని నిలదీశారు. జిల్లా ఇన్చార్జి మంత్రి పెద్దిరెడ్డి స్పందించాలని పోతిన మహేష్‌ డిమాండ్‌ చేశారు.

ABOUT THE AUTHOR

...view details