Pawan Kalyan Visit Samathamurthi Statue: భిన్న మతాలు, కులాలు, సంస్కృతులకు సమతామూర్తి విగ్రహం ప్రతీకగా నిలుస్తుందని జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కల్యాణ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలోని ముచ్చింతల్‌లో చిన్నజీయర్ స్వామి ఏర్పాటు చేసిన సమతామూర్తి కేంద్రాన్ని పవన్ కల్యాణ్ సందర్శించారు. సమతామూర్తి విగ్రహం ప్రాంగణం, యాగశాలను వీక్షించారు.
అనంతరం ప్రవచన మండపంలో చిన్నజీయర్ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా సమతామూర్తి విశేషాలను చినజీయర్ స్వామి పవన్‌కు వివరించారు. భక్తులను ఉద్దేశించి ప్రసంగించిన పవన్ కల్యాణ్.. సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించిన దేశ ప్రధానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.