పెట్రోల్, డీజిల్పై తన వాటా విలువ ఆధారిత పన్ను తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జనసేన పార్టీ డిమాండ్ చేసింది. ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. కనీసం అలాంటి ఆలోచనైనా చేస్తుందా? లేదా? అనే సందేహాన్ని వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం లీటరు పెట్రోలుపై రూ.5, లీటర్ డీజిల్ మీద రూ.10 చొప్పున పన్ను తగ్గించిందని.. కేంద్రం బాటలోనే ఇప్పటికే పలు రాష్ట్రాలు తమ వాటా పన్నులను తగ్గిస్తున్నాయని గుర్తు చేసింది. అసోం, త్రిపుర, కర్ణాటక, మణిపూర్, గుజరాత్, గోవా రాష్ట్రాలు రూ.7 వంతున, ఒడిశా రూ.3 చొప్పున తగ్గించాయని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఆ విధంగా చేయాలనే ఆలోచన ఉందా లేదా? ఉంటే ఏ మేరకు రాష్ట్రం వాటా పన్ను తగ్గిస్తారో ప్రభుత్వం ప్రజలకు తెలియచేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే వ్యాట్ తోపాటు అదనపు పన్ను, సెస్సులను రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తోందని విమర్శించారు. ఇతర రాష్ట్రాల మాదిరే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ మీద వ్యాట్ తగ్గించాలి.. లేని పక్షంలో వైకాపా ప్రభుత్వ వైఖరిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తామని అన్నారు.
రాష్ట్రప్రభుత్వం కనీసం అలాంటి ఆలోచనైనా చేస్తుందా? లేదా? - జనసేన పార్టీ
పెట్రోల్, డీజిల్పై రాష్ట్రప్రభుత్వం వ్యాట్ తగ్గించాలని జనసేన పార్టీ డిమాండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వం లీటరు పెట్రోలుపై రూ.5, లీటర్ డీజిల్ మీద రూ.10 చొప్పున పన్ను తగ్గించిందని.. కేంద్రం బాటలోనే ఇప్పటికే పలు రాష్ట్రాలు తమ వాటా పన్నులను తగ్గిస్తున్నాయని గుర్తు చేసింది.
నాదెండ్ల మనోహర్