ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'లబ్ధిదారుల సంఖ్యను తగ్గించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది' - AP Political News

రాష్ట్ర ప్రభుత్వం, సీఎం జగన్​పై జనసేన పార్టీ నేత పోతిన మహేశ్ విమర్శలు గుప్పించారు. ఏదో ఒక కారణం చెప్పి... లబ్ధిదారుల సంఖ్యను తగ్గించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. వాహనమిత్ర పథకానికి ముఖ్యమంత్రి జగన్‌ గాలి తీసి తుస్సుమనిపించారని ఎద్దేవా చేశారు.

జనసేన పార్టీ నేత పోతిన మహేశ్
జనసేన పార్టీ నేత పోతిన మహేశ్

By

Published : Jun 16, 2021, 5:23 PM IST

ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన వాహనమిత్ర పథకానికి ముఖ్యమంత్రి జగన్‌ గాలి తీసి తుస్సుమనిపించారని జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేష్‌ విమర్శించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఏదో ఒక సాకుతో వాహనమిత్ర లబ్ధిదారులను తొలగించి నామమాత్రపు పథకంగా అమలుచేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇక నుంచి కుటుంబానికి ఏవైనా ఒక పథకమే అమలయ్యేలా కార్యాచరణ రూపొందిస్తున్నారని.. అందులో భాగమే వాహనమిత్ర పథకంలో లబ్ధిదారుల తొలగింపు అని ఆరోపించారు. వాహనమిత్ర పథకానికి దేవాదాయశాఖ నిధులను మళ్లించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కుటుంబానికి ఒక పథకం కాకుండా అర్హులైన అందరికీ ఎలాంటి షరతులు లేకుండా... నవరత్నాల్లోని అన్ని పథకాలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

ABOUT THE AUTHOR

...view details