జనసేన అధినేత పవన్ రాష్ట్రవ్యాప్త పర్యటన.. ముహూర్తం ఖరారు - పవన్ పర్యటన
18:16 June 10
అక్టోబరు 5న తిరుపతి నుంచి పవన్ యాత్ర ప్రారంభం
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్ర వ్యాప్త పర్యటనకు మహూర్తం ఖరారైంది. అక్టోబరు 5న విజయదశమి రోజున తిరుపతి నుంచి పర్యటన ప్రారంభించి వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు పవన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. దసరా రోజున ప్రారంభించి ఆరు నెలల్లో రాష్ట్రమంతా పర్యటించడం, ప్రతి ఉమ్మడి జిల్లాలోనూ బహిరంగసభలు నిర్వహించనున్నట్టు జనసేన నేతలు పేర్కొన్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ పర్యటనలు ఉండేలా రూట్‌మ్యాప్ రూపొందిస్తున్నారు.
వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్‌లోనే ఎన్నికలు ఉంటాయనే సంకేతాలు వస్తున్నందున రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు పెద్దగా సమయం లేదని, ఇప్పటినుంచే నాయకులు సన్నద్ధం కావాలనేది పవన్ అభిప్రాయం. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఇప్పటికే పిలుపునిచ్చారు.
ఇవీ చూడండి