ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Janasena: రాష్ట్రవ్యాప్తంగా జనసైనికుల 'శ్రమదానం'

రాష్ట్రంలో అధ్వానంగా ఉన్న రోడ్లకు 'శ్రమదానం' ద్వారా మరమ్మతులు చేయాలని.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో జనసైనికులు.. రహదారులను మరమ్మత్తులను చేపట్టేందుకు యత్నించగా.. పలుచోట్ల పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు.

janasena party cadre helds shramadanam state widely
రాష్ట్రవ్యాప్తంగా జనసైనికుల శ్రమదానం

By

Published : Oct 2, 2021, 8:11 PM IST

రాష్ట్రంలో అధ్వానంగా ఉన్న రహదారుల పరిస్థితిపై.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ రోడ్ల మరమ్మత్తులు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో జనసైనికులు.. రహదారులను మరమ్మత్తులను చేపట్టేందుకు యత్నించారు. పలుచోట్ల పార్టీ శ్రేణులను పోలీసులు అరెస్టు చేశారు.

గుంతలను పూడ్చిన జనసైనికులు

మహాత్మాగాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో.. జనసేన పార్టీ నగర అధ్యక్షుడు పోతిన వెంకట మహేష్ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టారు. వన్ టౌన్ బోసు బొమ్మ కూడలిలో రోడ్లకు ఏర్పడిన గుంతలను పూడ్చిన జనసేన నాయకులు.. నిరసన చేపట్టారు. పెట్రోలు ధరలు పెరిగి.. రాష్ట్ర ఖజానాకు వేల కోట్లు చేరుతున్నప్పటకి ఆ డబ్బులను రోడ్ల నిర్మాణానికి ఖర్చుచేయక పోవటం దారుణమని పోతిన మహేష్ మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా జనసైనికులు శ్రమదానం చేసి రోడ్లు మరమత్తులు చేపడతామంటే.. అడ్డుకోవటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు.

సిమెంటు వేసి నిరసన..

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం బేతపూడిలో జనసేన శ్రేణులు శ్రమదానం నిర్వహించారు. గుంతల మయమైన బేతపూడి రహదారికి మరమ్మతులు చేశారు. సుమారు రెండు కిలోమీటర్ల మేర రహదారిపై సిమెంటు కంకర వేసి గుంటలు పూడ్చారు. నవరత్నాల పేరుతో.. వైకాపా ప్రభుత్వం ప్రజలపై మోయలేని భారాన్ని మోపుతోందని జనసేన నాయకులు ఆరోపించారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రహదారుల మరమ్మతులకు నెల రోజులు సమయం ఇచ్చినా.. ప్రభుత్వం నిద్ర మత్తు వీడటం లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే తాము మరోసారి ఇలాంటి కార్యక్రమానికి పిలుపునిస్తామని జనసేన రాష్ట్ర కార్యదర్శి చల్లపల్లి శ్రీనివాస్ తెలిపారు.

విజయనగరంలో నిరసన

రోడ్ల మరమ్మతుల విషయంలో వైకాపా ప్రభుత్వానికి ఇచ్చిన గడువు పూర్తయినా.. ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవటం సిగ్గుచేటని.. జనసేనపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి అన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపు మేరకు.. విజయనగరం ప్రధాన కూడలైన మయూరి జంక్షన్ వద్ద రోడ్ల పై గుంతలను పూడ్చి పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు.

నెల్లూరులో జనసైనికుల అరెస్టు

అస్తవ్యస్తంగా ఉన్న రహదారుల మరమ్మతులకు ప్రయత్నించిన జనసైనికులను..నెల్లూరు జిల్లాలో పోలీసులు అడ్డుకున్నారు. నెల్లూరు నగరం మైపాడు గేట్ సెంటర్ వద్ద శ్రమదానానికి పూనుకున్న జనసేన నాయకులను.. వారు అరెస్ట్ చేశారు. రూరల్ నియోజకవర్గ పరిధిలోని మినిబైపాస్ రోడ్డు ప్రాంతంలో పలువురు పార్టీ నాయకులు రోడ్లపై గుంతలు పూడ్చి నిరసన తెలిపారు.

ప్రకాశంలో భయంతోనే రోడ్లకు మరమ్మత్తులు

ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలంలో.. జనసేన నాయకులు నేడు గుంతలు పూడ్చేందుకు రాకముందే.. ఆర్ అండ్ బీ సిబ్బంది రోడ్డుకు మరమ్మత్తులు చేశారు. ఎన్నో ఏళ్లుగా మరమ్మత్తుకు నోచుకోని రోడ్లు.. తాము రాష్ట్రవ్యాప్తంగా పిలుపునివ్వగానే వైకాపా ప్రభుత్వం భయంతో బాగు చేసిందని పలువురు పార్టీ నాయకులు అన్నారు.

కర్నూలులో

రాష్ట్రంలో రహదారుల పరిస్థితి సరిగ్గాలేదని.. జనసేన నాయకులు అన్నారు. కర్నూలు నగరంలోని పాతబస్తీలో సరిగాలేని రోడ్లకు.. జనసైనికులు రహదారికి మరమ్మత్తులు చేశారు.


ఇదీ చదవండి:

clean andhra: స్వచ్ఛ సంకల్పం, క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాలు ప్రారంభించిన సీఎం..

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details