ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పంచాయతీ ఎన్నికల ఫలితాలు సంతృప్తినిచ్చాయి: నాదెండ్ల మనోహర్ - నాదెండ్ల మనోహర్ తాజా వార్తలు

రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు సంతృప్తినిచ్చాయని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. పవన్‌ నాయకత్వాన్ని బలపరచాలనే ఉద్దేశ్యంతో యువత, ఆడపడుచులు ప్రతి గ్రామంలో జనసేన బలపరిచిన అభ్యర్థులకు బ్రహ్మరథం పట్టారన్నారు.

పంచాయతీ ఎన్నికల ఫలితాలు సంతృప్తినిచ్చాయి
పంచాయతీ ఎన్నికల ఫలితాలు సంతృప్తినిచ్చాయి

By

Published : Feb 14, 2021, 4:41 PM IST

రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో జనసేన బలపరిచిన అభ్యర్థులు సాధించిన విజయాలు చాలా సంతృప్తినిచ్చాయని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. పవన్‌ నాయకత్వాన్ని బలపరచాలనే ఉద్దేశ్యంతో యువత, ఆడపడుచులు ప్రతి గ్రామంలో జనసేన బలపరిచిన అభ్యర్థులకు బ్రహ్మరథం పట్టారన్నారు. ఎన్నికల్లో గెలుపొందిన వారిని అభినందిస్తున్నానన్నారు.

జనసేన నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ..వైకాపా ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో మార్పు రావాలంటే కలిసికట్టుగా పోరాడాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మూడు,నాలుగో విడత ఎన్నికల్లోనూ..జనసేన బలపరిచిన అభ్యర్ధుల విజయానికి కృషి చేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details