విశాఖ ఉక్కు కర్మాగార పరిరక్షణ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు వచ్చిన ప్రజాధరణ చూసి వైకాపా నాయకుల వెన్నులో వణుకు పుట్టిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేశ్ అన్నారు. అందుకే ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పవన్‌ను విమర్శించే ముందు విశాఖ ఉక్కు కర్మాగార పరిరక్షణ కోసం వైకాపా ఎంపీలు, ఆ పార్టీ నాయకులు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
Janasena: అలా చేయకపోతే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు జగన్ మద్దతిచ్చినట్లే: పోతిన మహేశ్ - పోతిన మహేశ్ తాజా వార్తలు
పవన్‌ను విమర్శించే ముందు విశాఖ ఉక్కు కర్మాగార పరిరక్షణ కోసం వైకాపా ఎంపీలు, ఆ పార్టీ నాయకులు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేశ్ డిమాండ్ చేశారు. వైకాపాకు ప్రజల్లో ఆదరణ తగ్గిపోయి..,పార్టీ వెంటిలేటర్ మీదకి వెళ్లిపోయిందన్నారు.
అఖిలపక్షం ఏర్పాటు చేయకపోతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రైవేటీకరణకు మద్దతు ఇచ్చినట్లే భావించాల్సి ఉంటుందన్నారు. ఉక్కు ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తామని..మంత్రి కొడాలి నాని గతంలో ఉత్తరకుమారుడిలా ప్రగల్భాలు పలికి నేడు మాట తప్పారన్నారు. వైకాపాకు ప్రజల్లో ఆదరణ తగ్గిపోయి..,పార్టీ వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోయిందన్నారు. రాబోయే ఎన్నికల్లో వైకాపాకు ఘోర పరాభవం తథ్యమన్నారు.
ఇదీ చదవండి: Badvel Bypoll Result: బద్వేలు ఉప ఎన్నికలో ఫ్యాన్ జోరు.. మెజార్టీ ఎంతంటే..
TAGGED:
పోతిన మహేశ్ తాజా వార్తలు