ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Pothina Mahesh: రోడ్ల మరమ్మత్తులను వెంటనే చేపట్టాలి - జనసేన నేత పోతిన మహేష్ తాజా వార్తలు

నగర ప్రజల మీద పన్నుల భారం మోపిన ప్రభుత్వం.. రోడ్ల మరమ్మత్తులపై దృష్టి సారించకపోవడం దారుణమని.. పోతిన మహేష్ అన్నారు. విజయవాడ టూ టౌన్ చిట్టి నగర్ ప్రాంతంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను.. ఆయన పరిశీలించారు. గుంతలమయమైన రోడ్లతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు.

janasena leader pothina mahesh
గుంతలు పడ్డ రోడ్లను పరిశీలిస్తున్న పోతిన మహేష్

By

Published : Jul 23, 2021, 8:14 PM IST

విజయవాడ టూటౌన్ చిట్టి నగర్ ప్రాంతంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను జనసేన నగర అధ్యక్షులు పోతిన మహేష్ పరిశిలించారు. మంత్రి నియోజకవర్గంలోనే రోడ్లు దెబ్బతిని వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. రోడ్ల మరమ్మత్తులపై ప్రభుత్వం దృష్టి సారించకపోవడం దారుణమన్నారు. మంత్రి తన ఇంటిముందు భారీగా రోడ్లను వేయించుకుని.. టూ టౌన్ ప్రాంతంలో ప్రధాన రహదారి అయిన చిట్టినగర్, కొత్త గుళ్లు ప్రాంతంలోని రోడ్లను గాలికొదిలేశారని దుయ్యబట్టారు. యుద్ధప్రాతిపదికన బీఎంసీ అధికారులు రోడ్ల మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే జనసేన తరపున ఆందోళన చేపడతామని పోతిన మహేష్‌ హెచ్చరించారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details