Pothina Mahesh: దుర్గగుడి అమ్మవారి ఆలయంలో నిన్న హుండీల లెక్కింపులో బంగారాన్ని కాజేయాలనుకున్న వారిపై పోలీసులకు ఆలయ ఈవో ఎందుకు ఫిర్యాదు చేయలేదని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ నిలదీశారు. దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఎండోమెంట్ కమిషనర్, ఈవో భ్రమరాంబ ఈ అంశంపై స్పందించాలని డిమాండ్ చేశారు. అమ్మవారి ఆలయ ప్రతిష్ట దిగజార్చుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సెక్యూరిటీ టెండర్‌ను నిబంధనలకు విరుద్ధంగా మ్యాక్స్ సంస్థకు కొనసాగించాలని స్థానిక ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ దేవాదాయ శాఖ అధికారులను ఒత్తిడి చేయడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
Pothina Mahesh: చోరీపై ఈవో ఎందుకు ఫిర్యాదు చేయలేదు?: పోతిన మహేష్ - జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్
Pothina Mahesh: అమ్మవారి ఆలయంలో నిన్న హుండీల లెక్కింపులో బంగారాన్ని కాజేయాలనుకున్న వారిపై పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ నిలదీశారు. అమ్మవారి ఆలయ ప్రతిష్ట దిగజార్చుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

చోరీ విషయంలో పోలీసులకు ఈవో ఎందుకు ఫిర్యాదు చేయలేదు