ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వైకాపా నుంచి.. రాష్ట్రాన్ని విముక్తి చేయడమే లక్ష్యం: పవన్​కల్యాణ్​ - వైకాపా నేతల భూకబ్జాలు

PAWAN FIRES ON YSRCP :వైకాపా విముక్త ఏపీయే తమ ప్రధాన లక్ష్యమని..జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పునరుద్ఘాటించారు. ఇదే ప్రధాన ఎజెండాగా వచ్చే ఎన్నికలకు వెళ్తామని..... అందుకు అందరూ కలిసిరావాలని విజ్ఞప్తిచేశారు. విశాఖ పరిణామాలు ముమ్మాటికీ వైకాపా కుట్రేనన్న పవన్....ఓ వ్యూహం ప్రకారమే స్కెచ్‌ వేశారని ఆరోపించారు. ప్రతిదానికీ భాజపా సాయం కోరబోనని.. సవాళ్లను ఎదుర్కొని నిలబడటం తనకు తెలుసని స్పష్టం చేశారు.

PAWAN FIRES ON YSRCP
PAWAN FIRES ON YSRCP

By

Published : Oct 17, 2022, 6:54 PM IST

Updated : Oct 18, 2022, 6:52 AM IST

PAWAN COMMENTS ON YSRCP : విశాఖ విమానాశ్రయంలో దాడి ఘటనతో పాటు తన పర్యటనను అడ్డుకోవడం కోసం వైకాపా ముందస్తుగా ప్రణాళికను సిద్ధం చేసుకుందని జనసేన అధినేత పవన్‌క ల్యాణ్‌ ఆరోపించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన..విశాఖ పరిణామాలపై అనేక సందేహాలు వ్యక్తం చేశారు. 3 రాజధానులకు మద్దతుగా వైకాపా తలపెట్టిన విశాఖ గర్జనకు పోటీగా తాము జనవాణి కార్యక్రమం ఏర్పాటు చేశామన్న వ్యాఖ్యలు అసంబద్ధమన్నారు. 3 నెలల కిందటే తమ కార్యక్రమం ఖరారైందని చెప్పారు. గర్జనకు ప్రజాస్పందన లేకపోవడం....అదే సమయంలో విమానాశ్రయానికి వచ్చిన తనను స్వాగతించేందుకు భారీగా జనసందోహం రావడం వైకాకు రుచించలేదన్నారు. అందుకే పథకం ప్రకారం దాడికి తెరలేపారని పవన్‌ అనుమానం వ్యక్తం చేశారు.

"విశాఖలో నన్ను రెచ్చగొట్టి.. గొడవ జరిగేలా చేయాలని చూశారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌లు క్రిమినల్స్‌కు సెల్యూట్‌ చేసే వ్యవస్థ ఉండటం దారుణం. రాజకీయాల్లో క్రిమినల్స్​ ఉండకూడదనేది నా ఆశయం. వైకాపా నుంచి ఆంధ్రప్రదేశ్‌ను విముక్తి చేయటమే లక్ష్యం. వైకాపా విముక్తి కోసం వచ్చే ఎన్నికల్లో పోరాడతాం." -జనసేన అధినేత పవన్‌కల్యాణ్​

కుట్రప్రకారమే తతంగమంతా నడిచిందన్న పవన్‌ ....ఇదంతా మరో కోడికత్తి డ్రామా లాంటిదని ఎద్దేవా చేశారు. అరెస్టు చేసేందుకే తనను పోలీసులు పదే పదే రెచ్చగొట్టారన్నారు.

రాజధాని గురించి ఎవరూ మాట్లాడకూడదనేదే వైకాపా ఉద్దేశం. విశాఖ గర్జన ప్రకటించిన తర్వాతే మేం జనవాణి ప్రకటించామనడం సరికాదు. వైకాపా కార్యక్రమానికి ఇబ్బంది కలిగించాలనడం మా ఉద్దేశం కాదు. ఇతర పార్టీలను భయపెట్టి అదుపులో ఉంచాలనుకోవడం.. వైకాపా వ్యూహం." -పవన్

అధికారంలోకి రాకముందు అమరావతే రాజధాని అని నొక్కివక్కానించిన వైకాపా...ఇప్పుడు వికేంద్రీకరణ అనడం దుర్మార్గమన్నారు. విశాఖతో పాటు ఉత్తరాంధ్రలో అధికార పార్టీ నేతలు, మంత్రులు కొట్టేసిన భూముల కోసమే 3 రాజధానులను తెరపైకి తెచ్చారని విమర్శించారు.

వైకాపా నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయడమే లక్ష్యం

తానేమీ చిన్నపిల్లాడిని కాదన్న పవన్‌కల్యాణ్‌...ప్రతిదానికీ దిల్లీ వెళ్లి భాజపా పెద్దలను కలిసి వైకాపాపై ఫిర్యాదు చేయలేనని చెప్పారు. తాను ఓ పార్టీకి అధినేతనన్న ఆయన....తెలుగునేలపై నుంచే ఏపీని రక్షించుకుంటానని స్పష్టం చేశారు.

ఓ నేరస్తుడు రాష్ట్రాన్ని నడిపించే పీఠంపై కూర్చుంటే జరిగే అనర్థమే ఇప్పుడు ఏపీలో జరుగుతుందన్న పవన్‌...అలాంటి వాళ్ల నుంచి రాష్ట్రాన్ని, భావితరాల భవిష్యత్తును రక్షించడమే తమ ప్రధాన లక్ష్యమని తేల్చిచెప్పారు.

నసేన నేతలపై పోలీసులు పెట్టిన అక్రమ కేసులపై హైకోర్టులో పిటిషన్‌ వేసినట్లు పవన్‌ తెలిపారు. ఆ కేసు ఇవాళ విచారణకు రానుందన్న ఆయన....తప్పనిసరిగా న్యాయం గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

"వైకాపా నేతల భూకబ్జాలు బయటపడతాయనే ఉద్దేశంతోనే విశాఖలో జనవాణి కార్యక్రమం జరగనీయలేదు. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న దస్​పల్లా భూములు.. ప్రైవేటు వ్యక్తుల చేతిల్లోకి ఎలా వెళ్లాయి? ఉత్తరాంధ్ర మీద వైకాపా పెద్దలకు ప్రేమ ఉంటే.. మాజీ సైనికులకు చెందిన 71 ఎకరాల భూములు ఎందుకు ఆక్రమిస్తారు?. ఆంధ్రప్రదేశ్‌కు రాయలసీమ నుంచే ఎక్కువ ముఖ్యమంత్రులు వచ్చినా.. ఆ ప్రాంతం ఎందుకు వెనకబడి ఉంది. అధికారమంతా ఒక కుటుంబం చేతిలో పెట్టుకుని అధికార వికేంద్రీకరణ గురించి మాట్లాడటం హాస్యాస్పదం." -పవన్​కల్యాణ్

ఇవీ చదవండి:

Last Updated : Oct 18, 2022, 6:52 AM IST

ABOUT THE AUTHOR

...view details