ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఎం జగన్ వారిని ఎందుకు చర్చలకు ఆహ్వానించట్లేదు: నాదెండ్ల మనోహర్ - నాదెండ్ల మనోహర్ తాజా వార్తలు

చిత్రపరిశ్రమలో సమస్యలను తానే పరిష్కరిస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ సొంత ప్రచారం చేసుకుంటున్నారని జనసేన పీఏసీఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారానికి చొరవ చూపినట్లే.. అమరావతి రైతులపైనా దృష్టి సారించాలన్నారు. 787 రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నా వారిని ఎందుకు చర్చలకు ఆహ్వానించట్లేదని ప్రశ్నించారు.

సీఎం జగన్ వారిని ఎందుకు చర్చలకు ఆహ్వానించట్లేదు
సీఎం జగన్ వారిని ఎందుకు చర్చలకు ఆహ్వానించట్లేదు

By

Published : Feb 11, 2022, 4:05 PM IST

చిత్రపరిశ్రమలో సమస్యలను తానే పరిష్కరిస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ సొంత ప్రచారం చేసుకుంటున్నారని జనసేన పీఏసీఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. చిత్రసీమ సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి వ్యవహరించిన తీరు సరైంది కాదన్నారు. సినీ పరిశ్రమ సమస్యల కోసం కేవలం హీరోలతో చర్చలు జరపటం సరికాదని.. ఇతర వర్గాలకు చెందిన వారితోనూ మాట్లాడితే బాగుండేదన్నారు.

రాష్ట్రంలో అనేక సమస్యలున్నాయని వాటిపైనా ఇదే తరహాలో ఎందుకు చొరవ చూపించటం లేదని ప్రశ్నించారు. సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారానికి చొరవ చూపినట్లే అమరావతి రైతులపైనా దృష్టి సారించాలన్నారు. 787 రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నా వారిని ఎందుకు చర్చలకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు. ఇసుక, యూరియా కొరతపైనా శ్రద్ధ చూపించాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details