విజయవాడ కొవిడ్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదం హృదయవిదారకమని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఈ ఘటనలో 11 మంది మృత్యువాత పడడం విచారకరమని దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు తన తరఫున, పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. హోటల్ భవనంలో నడుస్తున్న కొవిడ్ కేంద్రంలో రక్షణ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ప్రమాదాలు జరిగితే బయటపడే అత్యవసర వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయి? అగ్నిప్రమాదానికి కారణాలు ఏమిటి? వంటి అంశాలపై లోతైన విచారణ జరపాలన్నారు. ఇలా హోటల్ భవనాల్లో నడుస్తున్న కరోనా కేంద్రాల్లో రక్షణ చర్యలపై సమీక్ష నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.