ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

చివరి క్షణాల్లో పురస్కారాల రద్దు.. ఉపాధ్యాయులను అవమానించడమే: పవన్​

జనసేన అధినేత పవన్​ కల్యాణ్​.. గురువులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాక్షాంకలు తెలిపారు. కరోనా పేరుతో ఉపాధ్యాయ పురస్కారాల కార్యక్రమాలను రాష్ట్రప్రభుత్వం రద్దుచేయడం పట్ల పవన్‌ కల్యాణ్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Janasena chief Pawan Kalyan
జనసేన అధినేత పవన్​ కల్యాణ్

By

Published : Sep 5, 2021, 5:27 PM IST

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన పవన్

కొవిడ్‌ నిబంధనల పేరుతో ఉపాధ్యాయ పురస్కారాల కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడం పట్ల జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పురస్కారాలు ఇస్తామని ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. విజయవాడలో నిర్వహించే ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమానికి రావాలని సమాచారం ఇచ్చి చివరి నిమిషంలో ఈ కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు చెప్పడం సరైన నిర్ణయం కాదన్నారు. ఇది ముమ్మాటికి ఉపాధ్యాయులను అవమానించడమే అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వ ఇకనైనా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ఉపాధ్యాయులకు అవార్డులు అందజేయాలని కోరారు.

గురువులను ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన పవన్​.. తల్లిదండ్రుల తర్వాత అత్యంత విలువైన స్థానం ఉపాధ్యాయులకే దక్కుతుందని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details