ఈ నెల 6న విజయవాడలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. 7న మంగళగిరి పార్టీ ఆఫీసులో జనసేన ముఖ్య నేతలతో సమావేశం అవుతారని.. ఈ సందర్బంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలు, జాబ్ లెస్ క్యాలెండర్ సహా పలు అంశాలపై చర్చించనున్న పార్టీ వర్గాలు తెలిపాయి.
తిరుపతి ఉప ఎన్నిక తర్వాత పార్టీలో నెలకొన్న పరిస్థితులపై ప్రధానంగా చర్చించనున్న సమాచారం. ఈ నేపథ్యంలో పలువురు నేతలతో రేపు జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సమావేశం కానున్నారు.