Pawan Kalyan on Agnipath: ఇవాళ ఉదయం తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చోటు చేసుకున్న ఘటనలు దురదృష్టకరమైనవని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అగ్నిపథ్ పథకం ద్వారా ఆర్మీ రిక్రూట్మెంట్ విధానంపై చేపట్టిన నిరసనల నేపథ్యంలో.. జరిగిన సంఘటనలు ఆవేదన కలిగించాయని ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. పోలీసు కాల్పుల్లో మృతి చెందిన యువకుడి కుటుంబానికి సానుభూతిని తెలిపారు. ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Pawan Kalyan on Agnipath: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటన దురదృష్టకరం: పవన్ కల్యాణ్ - పవన్ కల్యాణ్ తాజా వార్తలు
Pawan Kalyan on Agnipath: అగ్నిపథ్ పథకం ద్వారా ఆర్మీ రిక్రూట్మెంట్ విధానాన్ని నిరసిస్తూ చేపట్టిన ఆందోళనలపై.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటన దురదృష్టకరమని ట్విట్టర్ ద్వారా తెలిపారు.
పవన్ కల్యాణ్