కొవిడ్ వాక్సినేషన్ ప్రక్రియ 100 కోట్ల డోసుల మార్క్ దాటడం.. ప్రతి ఒక్కరు హర్షించాల్సిన మైలు రాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ప్రధాన మంత్రి మోదీ నాయకత్వంలో ఈ విజయం సాధించడం గర్వకారణమన్నారు. డబ్ల్యూహెచ్ఓ దగ్గర నుంచి వైద్య నిపుణులు ప్రతి ఒక్కరూ భారత దేశంలో కోట్లాది మంది చనిపోతారనీ, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుందని రకరకాల ఊహాగానాలు చేశారని గుర్తుచేశారు. వీటన్నింటినీ దాటుకుని వాక్సినేషన్ ప్రక్రియ 100 కోట్ల మార్క్ దాటడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదికి ఆరోగ్యశాఖకి శుభాకాంక్షలు తెలియజేశారు.
Pawan kalyan: కొవిడ్ వ్యాక్సినేషన్లో ఆ మార్కు..దేశానికే గర్వకారణం: పవన్ - కొవిడ్ వాక్సినేషన్
కొవిడ్ వాక్సినేషన్ ప్రక్రియ 100 కోట్ల డోసుల మార్క్ దాటడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి మోదీ నాయకత్వంలో ఈ విజయం సాధించడం గర్వకారణమన్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్