జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైకాపా ఎమ్మెల్యే జోగి రమేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా విజయవాడలో ఆ పార్టీ నాయకులు నిర్వహించిన ర్యాలీ ఉద్రిక్తతకు దారి తీసింది. బెంజిసర్కిల్ సమీపంలోని కృష్ణా జిల్లా లారీ యజమానుల సంఘం హాల్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. నిరసనకు అనుమతి లేదని, ధర్నా చౌక్‌కి వెళ్లి చేసుకోవాలని పోలీసులు సూచించారు. జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లిపోతామని జనసైనికులు బెంజి సర్కిల్ నుంచి ర్యాలీగా బయలుదేరారు. ఎమ్మెల్యే జోగి రమేష్, ముఖ్యమంత్రి జగన్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బ్యానర్లు పట్టుకొని వెళ్తుండగా పోలీసులు అడ్డుకొని బ్యానర్లు లాక్కున్నారు. ఈ విషయమై జనసేన నాయకులు, ఎస్సై మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక కార్యకర్త స్పృహ తప్పి కింద పడిపోగా అతన్ని మోసుకుంటూ పార్టీ కార్యాలయం వద్దకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసుల వైఖరిని ఖండిస్తూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఎమ్మెల్యే జోగి రమేష్ వ్యాఖ్యలపై జనసైనికుల నిరసన - జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైకాపా ఎమ్మెల్యే జోగి రమేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలు
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైకాపా ఎమ్మెల్యే జోగి రమేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా విజయవాడలో జనసేన నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జనసైనికులకు, ఎస్సైకు మధ్య వాగ్వాదం జరిగింది.
![ఎమ్మెల్యే జోగి రమేష్ వ్యాఖ్యలపై జనసైనికుల నిరసన Jana Sena leaders held a rally in Vijayawada in protest of the inappropriate comments made by ycp MLA Jogi Ramesh on Janasena chief Pawan Kalyan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6112101-905-6112101-1582017388712.jpg)
జనసేన ర్యాలీలో ఉద్రిక్తత