తితిదే పొరుగుసేవల కార్మికులకు ఊరట కల్పించడంపై జనసేన అధినేత పవన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం, తితిదేకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. 1,400 మంది కార్మికుల కొనసాగింపు సముచిత నిర్ణయమన్నారు.
కార్మికులను విధుల్లోకి తీసుకుని మానవత్వం చాటారని పవన్ ప్రశంసించారు. శ్రీవారిని నమ్ముకుని 15 ఏళ్లుగా స్వల్ప జీతాలకే పారిశుద్ధ్య సేవ చేస్తున్నారు. కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేసే ప్రతిపనికీ జనసేన సహకారం ఉంటుందని చెప్పారు.