సీఎం జగన్‌కు జలీల్‌ఖాన్ సవాల్..! - రాజధాని వివాదం
తన రాజకీయ జీవితంలో జగన్ లాంటి సీఎంను చూడలేదని.. తెదేపా నేత జలీల్‌ఖాన్ పేర్కొన్నారు. రాజధాని వివాదంతో ముఖ్యమంత్రి జగన్ తన పతనానికి నాంది పలికారని వ్యాఖ్యానించారు.
' ఒక్క అవకాశం ఇవ్వండి ఏపీని ఇంద్రలోకం చేస్తా' అని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్... రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మాజీఎమ్మెల్యే జలీల్ ఖాన్ మండిపడ్డారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన... రాజధాని కోసం 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు రాష్ట్ర ప్రజలందరూ మద్దతుగా నిలవాలని కోరారు. ఇప్పటికే రాజధాని అమరావతిలో ఎన్నో భవనాలు పూర్తయ్యాయని... కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయని వివరించారు. ఇటువంటి సమయంలో ఎవరూ రాజధాని మార్చాలని అనుకోరని వ్యాఖ్యానించారు. బోస్టన్ కమిటీకి అసలు రాజధానిపై అవగాహన ఉందా అని ప్రశ్నించారు. జగన్‌ది మంచి పరిపాలనే అయితే... విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యేను రాజీనామా చేయించి మళ్లీ గెలిపించుకోవాలని సవాల్ విసిరారు.
ఇదీ చదవండి:'బోస్టన్ నివేదిక కాదు... బోగస్ నివేదిక'