ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పార్టీ మారటానికి మంత్రి వెల్లంపల్లి సిద్ధంగా ఉండాలి: జలీల్ ఖాన్ - వెల్లంపల్లిపై జలీల్ ఖాన్ కామెంట్స్

అవినీతి అక్రమాలపై మంత్రి వెల్లంపల్లి బహిరంగ చర్చకు సిద్ధమా..? అని తెదేపా నేత జలీల్ ఖాన్ సవాల్ విసిరారు. వెల్లంపల్లి అవినీతి ప్రభుత్వం దృష్టికి వెళ్లిందని త్వరలోనే ఆయనపై చర్యలు తీసుకుంటారన్నారు.

పార్టీ మారటానికి మంత్రి వెల్లంపల్లి సిద్ధంగా ఉండాలి
పార్టీ మారటానికి మంత్రి వెల్లంపల్లి సిద్ధంగా ఉండాలి

By

Published : Feb 20, 2021, 7:14 PM IST

అవినీతి అక్రమాలపై మంత్రి వెల్లంపల్లి బహిరంగ చర్చకు సిద్ధమా..? అని తెదేపా నేత జలీల్ ఖాన్ సవాల్ విసిరారు. దుర్గమ్మ పాదాలపై ప్రమాణం చేసి తాను ఏ అవినీతికి పాల్పడలేదని చెప్పాలన్నారు. మంత్రి అవినీతి అక్రమాలకు అనిశా దాడులు నిదర్శనమని విమర్శించారు. వెల్లంపల్లి అవినీతి ప్రభుత్వం దృష్టికి వెళ్లిందని త్వరలోనే ఆయనపై చర్యలు తీసుకుంటారన్నారు. పార్టీ మారటానికి వెల్లంపల్లి సిద్ధంగా ఉండాలని హితవు పలికారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం తెదేపాలో ఎలాంటి విబేధాలు లేవని.. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం ఎంపీ కేశినేని నాని వెంట తామందరం నడుస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details