ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు.. నేడు విడుదల చేయనున్న సీఎం జగన్ - 'జగనన్న తోడు' పథకం

'జగనన్న తోడు' పథకం కింద చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. రుణాలను లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం జగన్ నేడు జమచేయనున్నారు.

రేపు విడుదల చేయనున్న సీఎం జగన్
రేపు విడుదల చేయనున్న సీఎం జగన్

By

Published : Feb 27, 2022, 9:58 PM IST

Updated : Feb 28, 2022, 3:35 AM IST

'జగనన్న తోడు' పథకం కింద చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలను రాష్ట్ర ప్రభుత్వం నేడు పంపిణీ చేయనుంది. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు రుణాలను ముఖ్యమంత్రి జగన్ జమ చేయనున్నారు. నిరుపేదలైన చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సంప్రదాయ చేతి వృత్తుల వారికి రుణాలు అందించనున్నారు.

ఒక్కొక్కరికి ఏటా రూ.10 వేల చొప్పున వడ్డీలేని రుణంగా ప్రభుత్వం అందిస్తోంది. 5,10,462 మంది చిరు వ్యాపారులకు రూ.510.46 కోట్ల వడ్డీ లేని రుణాలు, 16.16 కోట్ల వడ్డీ రీ-ఎంబర్స్‌మెంట్‌ కలిపి మొత్తం రూ.526.62 కోట్లును సీఎం జగన్ జమ చేయనున్నారు.చిరువ్యాపారులు రోజువారీ పెట్టుబడి ఖర్చుల కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ వడ్డీ లేని రుణాల్ని అందిస్తున్నట్లు ప్రభుత్వం ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది.

Last Updated : Feb 28, 2022, 3:35 AM IST

ABOUT THE AUTHOR

...view details