ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల కోసం రూ. కోటి ప్రోత్సాహకం: సీఎం జగన్ - ఏపీ తాజా వార్తలు

ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల కోసం రాష్ట్రంలో ఎన్నడూలేని విధంగా రూ. కోటి ప్రోత్సాహకం ఇస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీలను పారిశ్రామికవేత్తలుగా తయారుచేసేలా కొత్త కొత్త కార్యక్రమాలు రూపొందిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. వారికోసం జగనన్న వైఎస్​ఆర్ బడుగు వికాసం పథకాన్ని ప్రారంభించారు.

jaganna ysr badugu vikasam scheme
జగనన్న వైయస్​ఆర్ బడుగు వికాసం పథకం ప్రారంభం

By

Published : Oct 26, 2020, 1:19 PM IST

Updated : Oct 26, 2020, 2:06 PM IST

ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన ఔత్సాహికులకు ప్రత్యేక పారిశ్రామిక విధానం 'జగనన్న-వైఎస్సార్ బడుగు వికాసం' పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. 2020-23 సంవత్సరాలకుగానూ ఈ నూతన పారిశ్రామిక విధానం అమల్లో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎస్సీ-ఎస్టీలు శ్రామికులుగా మిగిలిపోయే కాలం పోయి పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు ఉద్దేశించిన జగనన్న- వైఎస్సార్ బడుగు వికాసం కార్యక్రమాన్ని రూపొందించినట్టు సీఎం జగన్ వ్యాఖ్యానించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి ఎస్సీ, ఎస్టీలలో నైపుణ్యాలను పెంచేందుకు కొత్త కార్యక్రమాల్ని చేపడుతున్నామని వెల్లడించారు.

రాష్ట్రంలో ప్రస్తుతం కోటి రూపాయల ప్రోత్సాహకాలను ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఇస్తున్నామని సీఎం వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక పార్కుల్లో 16.2 శాతం మేర ఎస్సీలకు , 6 శాతం మేర ఎస్టీలకు భూములు కేటాయించనున్నట్టు సీఎం వెల్లడించారు. వీరికి స్టాంపు డ్యూటీ, వడ్డీ రాయితీ , క్వాలిటీ సర్టిఫికేషన్, పెటెంట్ రుసుముల్లో రాయితీలు ఇస్తున్నట్టు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, అలాగే అగ్రవర్ణాల్లోని పేదల అభివృద్ధికి కూడా నవరత్నాలు సహా అనేక కార్యక్రమాలు చేపట్టినట్టు వివరించారు. సచివాలయాల్లో 82శాతం ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే దక్కాయని సీఎం వ్యాఖ్యానించారు. మరోవైపు పరిశ్రమలను స్థాపించాలనుకునే ఎస్సీ,ఎస్టీ వర్గాలకు చెందిన వ్యక్తులకు పూర్తి సమాచారం లభ్యం అయ్యేలా అధికారులు దృష్టి పెట్టాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.

Last Updated : Oct 26, 2020, 2:06 PM IST

ABOUT THE AUTHOR

...view details