Zero Interest Loans: జగనన్న తోడు పథకం కింద చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలను (Zero Interest Loans) ప్రభుత్వం నేడు పంపిణీ చేయనుంది. వివిధ రకాల చేతి వృత్తుల వారికి ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున గత ఆరు నెలల్లో అందించిన రూ.395 కోట్ల వడ్డీలేని రుణాలకు సంబంధించిన రూ.15.96 కోట్ల వడ్డీ మొత్తాన్ని ముఖ్యమంత్రి జగన్ తన క్యాంపు కార్యాలయంలో బుధవారం బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలో జమచేయనున్నారు. గత ఆరు నెలల్లో ఇచ్చిన రూ.395 కోట్లతో కలిపి పథకం ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు 15,03,558 మంది లబ్ధిదారులకు రూ.2,011 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించినట్లు ప్రభుత్వం పేర్కొంది. బ్యాంకులకు కట్టిన వడ్డీ మొత్తాన్ని ప్రతి ఆరు నెలలకోసారి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నట్లు ప్రభుత్వం వివరించింది. రుణం తీర్చిన లబ్ధిదారులు మళ్లీ వడ్డీలేని రుణం పొందేందుకు అర్హులని తెలిపింది. పథకం ప్రారంభించాక ఇప్పటివరకు 5,07,533 మంది సకాలంలో రుణాలు చెల్లించి రెండోసారి తీసుకున్నారని పేర్కొంది. అర్హత కలిగి జాబితాల్లో పేర్లు నమోదు కాని వారు ఆందోళన చెందాల్సిన పని లేదని..గ్రామ, వార్డు వాలంటీర్లను సంప్రదించి సచివాలయాల్లో దరఖాస్తులు చేసుకోవచ్చని ప్రభుత్వం సూచించింది.
చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు.. నేడు విడుదల చేయనున్న సీఎం జగన్
Jagananna Thoudu Scheme: జగనన్న తోడు పథకం కింద చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం నేడు పంపిణీ చేయనుంది. సీఎం జగన్ (CM Jagan) క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు.
చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు
Last Updated : Aug 3, 2022, 7:07 AM IST