జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంపై గ్రామ సర్పంచ్‌లకు శిక్షణ తరగతులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. జూలై 8న రాజశేఖర్రెడ్డి జయంతి సందర్భంగా... ఆ రోజున సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. గ్రామాల్లో పరిశుభ్రత, స్వచ్ఛతకు పెద్దపీట వేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.
ప్రజల్లో అవగాహన కల్పించాలి...
జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం ద్వారా ఇంటిని, గ్రామాన్ని మనమే బాగు చేసుకోవడం అనే అవగాహన ప్రజల్లో కల్పించి వారిని భాగస్వాములను చేయాలని గ్రామ సర్పంచ్లు, అధికారులకు మంత్రి పెద్దిరెడ్డి సూచించారు. పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారికి పీపీఈ కిట్లు, మాస్కులు అందుబాటులో ఉంచామని వివరించారు. రాష్ట్రంలోని 17 గ్రామ పంచాయతీలకు ఉత్తమ విధానాలను అమలు చేస్తున్నందుకు కేంద్రప్రభుత్వం ఈ ఏడాది పురస్కారాలు ఇచ్చిందని, అధికారులు, కిందిస్థాయి సిబ్బంది చొరవతోనే ఇది సాధ్యమైందని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు.
ఊతమిస్తోన్న ఉపాధి హామీ పథకం...