Jagananna Colony Road problems ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని లేఅవుట్‌లో ట్రాక్టర్లు వెళ్లడానికి తాత్కాలికంగా వేసిన రోడ్లు ఇటీవల కురిసిన వర్షాలకు అధ్వానంగా మారాయి. ఇంటి నిర్మాణ సామగ్రి తీసుకొస్తున్న ట్రాక్టర్లు రోడ్లపై గుంతల్లో కూరుకుపోతున్నాయి. ఇసుక, ఇటుకలు మధ్యలోనే దించేయాల్సి వస్తోంది. నిర్మాణాల కోసం తీసుకొచ్చిన ఇసుక బురదలో కలిసిపోతుందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారులు ఇలానే ఉంటే ఇళ్ల నిర్మాణం తమకు తలకు మించిన భారమవుతుందని వారు వాపోతున్నారు. గృహప్రవేశం చేసిన వారు కూడా రాకపోకలకు అవస్థలు పడుతున్నారు.
Jagananna Colony Road problems జగనన్నాపేదల గూడుకు దారేదన్నా - ఏపీ తాజా వార్తలు
Jagananna Colony Road problems జగనన్న కాలనీల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్న హామీలు అమలుకావడం లేదు. కొన్ని లేఅవుట్లలో కనీస సౌకర్యాలు లేక లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు.
జగనన్న కాలనీ