ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేడు 'జగనన్న చేదోడు పథకం' నిధులు విడుదల చేయనున్న జగన్​

Jagananna Chododu scheme: రాష్ట్ర ప్రభుత్వం.. నేడు "జగనన్న చేదోడు" పథకం కింద రూ.285.35 కోట్లు విడుదల చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రజక, నాయీబ్రాహ్మణ, దర్జీలకు రూ. 10వేల చోప్పునా ఆర్థిక సాయాన్ని సీఎం విడుదల చేయనున్నారు.

'జగనన్న చేదోడు పథకం'
'జగనన్న చేదోడు పథకం'

By

Published : Feb 7, 2022, 9:20 PM IST

Updated : Feb 8, 2022, 2:12 AM IST

Jagananna Chododu scheme: నేడు.. "జగనన్న చేదోడు" పథకం నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. దుకాణాలున్న రజక, నాయీబ్రాహ్మణ, దర్జీలకు.. ఈ పథకం కింద రూ.10 వేల చొప్పున ఆర్ధిక సాయం అందించనుంది.

రాష్ట్రవ్యాప్తంగా 2,85,350 మంది రజక, నాయీబ్రాహ్మణ, దర్జీలకు రూ.285.35 కోట్ల ఆర్ధిక సాయాన్ని సీఎం విడుదల చేయనున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు.

ఇప్పటివరకు జగనన్న చేదోడు పథకం కింద రూ.583.78 కోట్లు అందించినట్లు ప్రభుత్వం తెలిపింది. పాత అప్పులకు జమ చేసుకోలేని విధంగా, లబ్ధిదారుల ఖాతాలను అన్‌ఎన్‌కంబర్‌ చేయించి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. దుకాణాలున్న 1,46,103 మంది టైలర్లకు 146.10 కోట్లు, 98,439 మంది రజకులకు రూ.98.44 కోట్లు, 40,808 మంది నాయీబ్రాహ్మణులకు రూ.40.81 కోట్ల లబ్ధి చేకూర్చనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

ఇదీ చదవండి

Statue of Equality: సమతామూర్తి.. భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తి : సీఎం జగన్

Last Updated : Feb 8, 2022, 2:12 AM IST

ABOUT THE AUTHOR

...view details