భారత రాయబారితో సీఎం జగన్ సమావేశం
రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి అమెరికాలో భారత్ అధికారులు గట్టి పునాదులు వేశారని సీఎం జగన్ ప్రశంసించారు.
రాష్ట్రంలో వ్యాపారాలు, పెట్టుబడులకు కొత్త అవకాశాలున్నాయని...ఏపీ-అమెరికాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడేందుకు ఉపయోగపడతాయని ముఖ్యమంత్రి జగన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. వ్యాపార, వాణిజ్య, ఇంధన రంగంలో సహకారం, సాంస్కృతిక రంగాల్లో పరస్పరం భాగస్వామ్యాలకు ఇది దారితీస్తుందని ఆకాంక్షించారు. సీఎం జగన్, భారత రాయబారి హర్షవర్దన్ ఇచ్చిన విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత రాయబార కార్యాలయ సీనియర్ అధికారులు, వ్యాపార, వాణిజ్యవేత్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ముఖ్యమంత్రి నాయకత్వాన్ని భారత రాయబారి హర్షవర్దన్ ప్రశంసించారు. జగన్ సంకల్పం, స్థిరత్వం, పారదర్శక విధానాలు ఏపీని వ్యూహాత్మక మార్గం వైపు నడిపిస్తున్నాయని, పెట్టుబడులను ఆకర్షిస్తాయని హర్షవర్దన్ అన్నారు.
TAGGED:
ANUSHKA