తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌తో విజయవాడ గేట్ వే హోటల్‌లో వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న జగన్.. అక్కడి నుంచి నేరుగా గేట్‌వే హోటల్‌కు చేరుకున్నారు. గవర్నర్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. పుష్పగుచ్చాన్ని అందించారు. శాలువాతో సత్కరించారు. గురువారం మధ్యాహ్నం 12 గంటల 23 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంపై మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో పాటు.. తన ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే ఇతర ప్రముఖుల గురించి వివరించారు.
గవర్నర్ నరసింహన్ తో జగన్ సమావేశం - గవర్నర్ నరసింహన్
వైకాపా అధ్యక్షుడు జగన్.. గవర్నర్ నరసింహన్ తో విజయవాడ గేట్ వే హోటల్ లో భేటీ అయ్యారు. గురువారం మధ్యాహ్నం 12 గంటల 23 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయనున్న జగన్.. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్టు సమాచారం.
'గవర్నర్ నరసింహన్ తో జగన్ భేటీ'
ఎన్నికలకు ముందు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన నవరత్నాల అమలుపై తన ఆలోచనలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ప్రమాణ స్వీకారం తర్వాత శాఖలవారీగా నిర్వహించబోయే సమీక్షలు.. జూన్ ఏడో తేదీన మంత్రివర్గ విస్తరణ.. కొత్త జిల్లాల ఏర్పాటు అంశాలు కూడా ఈ భేటీలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఇవి చదవండి...సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్, స్టాలిన్