ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జగన్ అక్రమాస్తుల కేసు విచారణ రేపటికి వాయిదా

హైదరాబాద్ సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి.. జగతి పబ్లికేషన్స్‌ డిశ్చార్జ్ పిటిషన్, అభియోగాల నమోదుపై ఇవాళ వాదనలు జరిగాయి. కేసు విచారణ రేపటికి వాయిదా పడింది.

జగన్ అక్రమాస్తుల కేసు విచారణ రేపటికి వాయిదా
జగన్ అక్రమాస్తుల కేసు విచారణ రేపటికి వాయిదా

By

Published : Nov 9, 2020, 7:01 PM IST

Updated : Nov 9, 2020, 8:11 PM IST

హైదరాబాద్ సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ రేపటికి వాయిదా పడింది. సీబీఐ కేసులతో సంబంధం లేకుండా తమ ఛార్జ్ షీట్లపై విచారణ ప్రారంభించాలని ఈడీ వాదించింది. సీబీఐ, ఈడీ ఛార్జ్ షీట్లలో అభియోగాలు వేర్వేరని పేర్కొంది. తమ వాదనను సమర్థించే పలు తీర్పులను ఈడీ తరఫు న్యాయవాది సుబ్బారావు న్యాయస్థానానికి సమర్పించారు.

మరోవైపు జగతి పబ్లికేషన్స్​లో పెట్టుబడులకు సంబంధించిన సీబీఐ అభియోగపత్రంలో జగన్ డిశ్చార్జి పిటిషన్, అభియోగాల నమోదుపై సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి ఇవాళ కూడా వాదించారు. జగన్​పై నేరాభియోగాలకు ఎలాంటి ఆధారాలు లేవని.. సీబీఐ పేర్కొన్న అభియోగాలేవీ జగన్​కు వర్తించవని పేర్కొన్నారు. సీబీఐ, ఈడీ కేసుల్లో వాదనలు మంగళవారం కూడా కొనసాగనున్నాయి.

Last Updated : Nov 9, 2020, 8:11 PM IST

ABOUT THE AUTHOR

...view details