హైదరాబాద్ సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. జగతి పబ్లికేషన్స్ అంశంలో విజయసాయిపై అభియోగాల నమోదుపై సీబీఐ వాదనలు వినిపించింది. విజయసాయిపై అవినీతి నిరోధక చట్టం కింద అభియోగాల నమోదుకు విజ్ఞప్తి చేసింది.
వాదనలు విన్న న్యాయస్థానం..జగతి పబ్లికేషన్స్, పెన్నా కేసులు, వాన్‌పిక్, రాంకీ సిమెంట్స్ ఛార్జిషీట్లపై విచారణ ఈ నెల 12కు వాయిదా వేసింది.